| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | శల్యపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
చండగదాపరస్పర ఘట్టనంబుల | మింటఁ బె ల్లడరెడుమంటగములఁ బరమఘోరము లగు పదతాడనంబుల | నొలయు వసుంధరాచలనములను నుద్భటక్రోధ సముద్రేకములఁ జూడ్కు | లం దుల్లసిల్లెడు నరుణరుచుల దారుణధ్వను లగుతర్జనలీలలఁ | బరఁగుపర్వత గుహాప్రతిరవముల |
|
| తే. |
ననిమిషుల దృష్‌ట్లు మిఱుమిట్లు గొనఁగ భుజగ | పతియుఁ గూర్మంబు సంకటపడఁగఁ దరణి కిరణములు వెల్కఁ బాఱ దిక్కరులు బెదర | నొప్పె నత్తొలితాకు మహోగ్ర మగుచు. |
255 |
| వ. | ఇట్లు తలపడి మండలప్రచార వివిధ ప్రకారంబులం బుడమికిం జిత్రగదాసారణ బహుభంగుల నింగికిం గ్రొత్త యొ ప్పాలయం దమలావును వేగంబును నేర్పును దర్పంబును జూపఱకు వెఱఁగుఁ బుట్టింప నంతకంతకు నెక్కుడగు మదంబులం బొదలెడు బాహుదండంబుల బలనైపుణంబు లగ్గింపం బేర్చు బీరంబుల నొండొరుల సంరంభంబుల సరకుగొనక యక్కురుపాండవపుంగవులు జంభవాసవులచందంబునం బెనంగినం బలుదెఱంగు లైన గదా ప్రహతులం దునియలుఁ బఱియలుఁ దుముళ్ళునై సీసకంబులు కత్తళంబులు ధరాతలంబునం దొఱంగె; నట్టియెడ. | 256 |
| మ. |
ఒకది క్కుద్ధతిఁ బూన్చి యొండుదెస వ్రేయున్ మేను వంచించి వ్రేఁ తకుఁ దప్పన్ వడివ్రేయు నొడ్డనమునం దప్పించి వేగంబు గుం దక నొప్పించుఁ జలం బెలర్పఁగ గదాదండంబు దూలించుఁ బాం డుకుమారుం డుఱ కట్లు కౌరవవిభుండుం గేలి సల్పుం దగన్. |
257 |
| వ. | మఱియును శిక్షావిశేషంబులు వెలయ నుల్లసిల్లి. | 258 |
| మ. |
గదతోడన్ గద చుట్టి రాఁ దిగుచుచున్ గం డొప్ప లంఘించి మా ఱు దెసల్ గైకొనుచుం గడంగి పలుమాఱుం దాఁకుచుం బాయుచుం బదబాహాకటిమధ్యవక్షముల సంభావ్యత్వరాచిత్రితో న్మదనానాగతరేఖలన్ మెఱయ భీమత్వత్సుతుల్ దీప్తు లై. |
259 |
| ఉ. |
తప్పినయప్డు వ్రేటు దముఁ దాఁకినయప్పు డనేక భంగులై యొప్పులు బల్పులున్ మెఱయ నుల్లములన్ సకలాంగకంబులం గప్పఁ దలిర్చు కోపములఁ గ్రమ్మెడు రక్తములన్ సురవ్రజం బప్పటి కప్డు వింత యగునచ్చెరు వొందఁగఁ బోరి రేపునన్. |
260 |
| వ. | ఆ సమయంబున. | 261 |
| సీ. |
వితతవీరాగ్రహావేశాదిదర్పిత | చిత్తులై యొండొరు నొత్తరించు నుగ్రమహోద్ధతి నుద్భటాటోపతీ | వ్రములగు సమరవిభ్రమము లంగ సంగతంబులు గాఁగ జయవాంఛనాత్మర | క్షణములవలని నైపుణము లెడలు టయు, ననర్గళ నిరూఢప్రహారంబులం | దంద బెట్టిరువురయందు సూడు |
|
| తే. |
పడఁగఁ దాఁకిన శోణిత ప్రసరణంబు | నిరతిశయ మైన వెడ సోలి నిలిచి గదలు వామకరముల నూఁదియు వారు మగుడఁ | బోరి కెలయుట నిర్భరాద్భుతము సేసె. |
262 |
| వ. | ఇట్లు ధైర్యధుర్యోత్సాహంబులం బొదలి. | 263 |
| శా. |
రౌద్రోల్లాసము మూర్తి సంకలన ఘోరంబై పొరిం బేర్చె నా నుద్రిక్తం బగునూత్నరక్తమున మగ్నోన్మగ్నతం బొల్చి త ర్జద్రూపోగ్రగదాయుగంబు విసరత్సంధ్యాంబుదద్వంద్వభా స్వద్రేఖాలలితంబు చెన్నువడసెన్ వారిద్దఱుం బోరఁగన్. |
264 |
| క. |
సుర లచ్చెరువును మెచ్చును | బిరికొనుచిత్తములతోడఁ బెద్దయుఁ బ్రొ ద్ద య్యిరువుర గెలుపోటమి తెఱఁ | గరసి నిరూపింపనేరరైరి నరేంద్రా! |
265 |
| తే. |
అప్పు డప్పుడ తలపడినట్టు లప్పు | డేచి విలసిల్లు మేనుల యెఱ్ఱచెలువు గలయఁ బూచిన నడ మ్రోదువులఁ దలంపఁ | బట్టుగా నొప్పె నధిప! నీపట్టిదోయి. |
266 |
| వ. | ఇవ్విధంబున నొండొరులకు వట్రపడక యమ్మేటిమగలు సాటోపసంరంభంబులం బెనంగి; రందు గాంధారీనందనుండు వలపలించి చుట్టుకొని రా నది సరకుసేయక బకవైరి దాపలించి తిరిగినం బెరిఁగిన యీరసంబున నుల్లసితుం డై యాభూవల్లభుం డతనిబరియెముక లగల వ్రేసిన, నవ్వీరుం డక్కౌరవపతి కరంబుతో నగ్గద బీఱువోవ వ్రేయం బాయక మగుడం బూన్చి సారించినం దోరంపు మెఱుంగు లెసంగం జెలంగుశబ్దంబులు నింగి ముట్ట బెట్టిదంబుగఁ దా వెరవునం దిరిగి యద్ధరణీశుండు శిరస్తాడనంబు సేసెఁ, జేసినం గౌంతేయుండు గంపింపమి యక్కజం బై యుండె; నంత నగ్గలం బగునలుక నవ్వడముడి పుడమి ఱేనివెడఁద యురం బుపలక్షించి లాఘవఘోరంబుగ గదాదండంబు ద్రిప్పి వైన, నాతం డది మేనినుసులునం దప్పింప నది యిల చలింపం బడిన నన్నుసులు తెఱపిన యురికి యద్భుతవేగుం డగు నావాయుపుత్రుండు గద పుచ్చుకొని తిరుగుసందున దుర్యోధనుండు తదీయ వక్షఃస్థలంబు దారుణప్రహారంబున నొప్పించిన నతండు పాండవపాంచాలుర చిత్తంబులు దూలసోలియు, నాలోనన తెలివొంది బలవిక్రమంబులు మెఱయ నమ్మేదినీపతి పార్శ్వభాగంబు బెట్టడిచిన మ్రోఁకరిలంబడియును వీఁక చెడక యెగసి యజ్జగతీపతి తన్ను నగుచు నార్చుపగతురు సిగ్గువడ నగ్గలికసొంపు పొంపిరివోవఁ బవనతనయుఫాలకర్ణ మధ్యప్రదేశంబు పటుప్రహతిం బగిల్చిన నొల్లంబోయి శీఘ్రంబునం దేరి యమ్మహాబలనందనుండు గండతలంబునం దొరుఁగునెత్తు రనుమదంబున మత్తకరి ననుకరించుచుఁ దుండంబు చందంబునం జెలు వొందుగద యల్లార్చి పేర్చి వ్రేటుగొనిన మెడకెలను దాఁకి నీకొడుకు మహాపవనపతితం బగు సాలంబు పోలికిం గూలినం గని ధర్మ పుత్రప్రముఖులు ప్రమోదంబు నొందిరి; గ్రక్కున లేచి కాలాకారుం డై ధాత్రీనాథుఁడు చిత్రభ్రమణంబుల వెగడుపఱిచి పలువ్రేటుల నొప్పించినం గిమ్మీరవైరి వసుధం ద్రెళ్ళుటయు నది సావుగాఁ గొని యక్కురుసింహుండు సింహనాదంబు సేయ నవ్వాయుసుతుండు సావమి యెఱింగి యాభూపతి పెనంగుభంగియుఁ గనుంగొని మెచ్చి సురప్రకరంబులు పుష్పవర్షంబు గురియం బరులకుం భయం బొలసె; నంతం దెలిసి భీమసేనుం డుద్వృత్తలోచనుం డై వీరావష్టంభంబునం బొలిచె; నప్పుడు సాత్యకి ధృష్టద్యుమ్న నకులసహదేవు లే లేమి? యని సుయోధను సంగ్రామంబునకుం బిలిచిన విని యా వృకోదరుండు వారల వల దని వారించి విగతఖేదుం డగుచు నాకేశుండు నముచిం దాఁకిన తెఱంగున రారాజుం దలపడి బహుచిత్రగతులం జరింపం జూచి సవ్యసాచి జనార్దనున కి ట్లనియె. | 267 |