| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - ప్రథమాశ్వాసము |
| చ. |
అవిరళ దర్శనస్థిర మహాముని మానసవాస ఖేలనో త్సవరసికా! రసాత్మక! నితాంతకృపాకర దివ్యచిత్త! స త్త్వవిభవ సంభృతైక్య సుఖతామయదేహ! నిరామయా! పున ర్భవ పరిహార హారిపద పద్మయుగస్తవ! హృద్యసంస్తవా! |
320 |
| క. |
కమలవన సదృశదృగ్రుచి | సముదయశమితార్తి భక్త సంఘా! లక్ష్మీ రమణత్వ శివాప్రియతా | సమవా యాలంబ్యమాన సౌందర్యనిధీ! |
321 |
| మాలిని |
అనుభవశమరమ్యా! హంసభావైక గమ్యా! వినమదఘవిదారీ! విశ్వలోకోపకారీ! దినకరశశినేత్రా! ధీపరిస్పందచిత్రా! దనుజమథనలీలా! ధర్మతత్త్వానుకూలా! |
322 |
| గద్యము | ఇది శ్రీమ దుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి ప్రణీతంబయిన శ్రీ మహాభారతంబున కర్ణపర్వంబునందుఁ బ్రథమాశ్వాసము. | 323 |
| కర్ణపర్వంలోని ప్రథమాశ్వాసం సమాప్తం. | ||