| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | ఇట్లు గాండీవం బెత్తి యెక్కువెట్టి, యన్నరుండు ‘నేఁడు నా బాణంబులు బాణాసనంబును నరదంబునుం జూచి సుయోధనుండు శకునిచేతి యడ్డసాళ్ళును పలకయు నమ్మండపంబును దలంపవలయుఁ; దన నమ్మిన బంటైన కర్ణుండు నే నేయు తూపుల తాఁకున రూ పడంగినం గని, యవ్వెంగలి దాను విదురుబుద్ధి వినమికి వగం బొందవలయు; ధృతరాష్ట్రుండు దనకుం గార్యదర్శనంబు లేమి యుగ్గడించి తన్నుం దాన నిందించుకొనవలయు; నతండు గొడుకుల దెసను వారు రాజ్యంబుదెసను విగతాశులు గావలయు’ నని పలికి, మఱియును. | 131 |
| ఆ. |
‘రాజరాజుఁ బాసి రాజ్యసంపద ధర్మ | తనయుఁ జేరుపెంపు దారు దెలియఁ గాంచి, సాత్యకియును గవలును భీముండు | గారవించువారు గాక నన్ను.’ |
132 |
| క. |
‘సుర గరుడోరగ విద్యా | ధరాది భూతములు సూతతనయుని నేఁ డేఁ బొరి పుచ్చిన ననుఁ బొగడుచు | నరుగుంగా కునికిపట్ల కంబుజనాభా!’ |
133 |
| వ. | అని యిట్లు సల్లాపంబు సేయుచుం, గృష్ణార్జునులు; నిజ సేనఁ జేరి; రంతకు మున్న యిరువాఁగునం జేయంగల దొరలు దలపడినం బోరు ఘోరం బయ్యె; నందు. | 134 |
| సీ. |
కర్ణుసూనులలో నొకం డుత్తమౌజుని చేతఁ | జచ్చుటయు, శోకాతురుండుఁ గ్రోధదీప్తుండు నగుచుఁ గర్ణుఁ డాతని | తురగ కేతనములఁ దునుము నాతఁ డడిదంబు సేకొని యరదంబు డిగి కృపా | చార్యు రథ్యంబులఁ జంపి భీష్మ వైరి తేరెక్కె; నాశారద్వతుం డట్లు | విరథుఁ డయ్యును బలువిడిఁ గడంగ |
|
| ఆ. |
నతఁడు పాదచారి యని యా శిఖండి య | వ్విప్రు నేయఁ డయ్యె; వేగ మెయ్ది ద్రౌణి యతనిఁ దన రథంబుపై నిడికొని | యనికిఁ దొలఁగి చనియె మనుజనాథ! |
135 |
| వ. | అట్టియెడ. | 136 |
| చ. |
అనిలసుతుండు తీవ్రవిశిఖాంశులు పర్వఁగ నేచి, యంబరం బు నడుమఁ దేజరిల్లు రవిఁ బోలెడు వేఁడిమి కోహటించి నీ మొన దెరలంగ, నా రథికముఖ్యుఁడు పార్థుఁ దలంచి సారథిం గనుఁగొని, మానసంబు దలఁకం బ్రధనోగ్రత దక్కి యిట్లనున్. |
137 |
| క. |
‘నరుఁ డన్నవర్తనము తెఱఁ | గరయుటకై మది గలంగ నట చనినాఁ; డ న్నరపతి దుర్దశ గని దు | స్తరశోకం బడరి, తానుఁ దదవస్థుఁ డగున్.’ |
138 |
| తే. |
అయ్యిరువురకు నొకటి యైనట్టిదైన | మనము, కౌరవసంఘంబు మ్రగ్గఁ జేసి గెలుపుగొంటిమి యేనియు, ఫలము దాన | నేమి గల దనువగఁ జిత్త మెరియఁ జొచ్చె.’ |
139 |