| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - తృతీయాశ్వాసము |
| తే. |
సారథుల యుబ్బు వాజుల చటులతయును | మెఱయ నొప్పారు తేరుల మీఁదఁ బొలిచి రపుడు గయ్యంపు వేడుక, నాతఁడును న | తండుఁ జూపఱ కన్నులపండు వగుచు. |
193 |
| క. |
ఒండొరులమీఁద నుజ్జ్వల | కాండము లడరించు చట్లు గదిసినయెడ, భీ ముండు ప్రమోదభరిత చి | త్తుం డయి, తగ నిట్టు లనియె దుశ్శాసనుతోన్. |
194 |
| ఉ. |
‘ఆ సభలోనఁ గొన్నఋణ మంతయు నీఁగఁగఁ గంటి వడ్డితో; బాస కొకింతయుం దొలఁగఁ బాఱక తీర్చెద నిప్డు; నేఁడు నా చేసినపుణ్య మెవ్వరును జేయరు; ని న్నిటు సేరఁ దెచ్చుటం జేసి విధాత నాకుఁ గృప సేయుట గానఁగ వచ్చెఁ దమ్ముఁడా!’ |
195 |
| వ. | అనిన విని, యతఁ డతని కిట్లనియె. | 196 |
| సీ. |
‘ఎఱుఁగుదు మఱచితినే లక్కయింటఁ జి | చ్చిడి మిమ్ముఁ బఱచినయిడుమ? లవియుఁ గాకయు, నమ్మెయి గాంధారరాజు మీ | యన్నతో వెడజూద మాడి రాజ్య లక్ష్మిఁ జేకొని కానలకుఁ బోవ నడిచితి; | మందుఁ బెక్కాపద లనుభవించి, యజ్ఞాతవాసార్థ మవ్విరాటుని ప్రోలి | కరిగి యత్యంత దైన్యంబు నొంది. |
|
| ఆ. |
యట్ల మీర లునికి యప్రసిద్దమె? యివి | యేల రిత్తమాట లేటు పోటు దలకు వచ్చి?’ యనుడు; దరహాసమునఁ గెంపు | గదురఁ బవనసుతుఁడు గడఁగి డాసి. |
197 |
| క. |
భల్లములు మూఁట సిడమును | విల్లు నఱికి, సూతకంఠ విదళనమున శో భిల్లి, నిటలమునఁ బటు ద | ర్పోల్లసితుం డగుచు నాటె నొక నారసమున్. |
198 |
| వ. | దాన బీఱువోవక దుశ్శాసనుండు. | 199 |
| క. |
తురగములఁ దాన నడపుచు | వెరవు రయము మెఱయ నొండువిలు గొని, గాఢ స్ఫురణమున భీము తనువునఁ | బరఁగించె మెఱుంగు లడరఁ బండ్రెం డమ్ముల్. |
200 |
| క. |
తోడన కోదండము దును | మాడెను. సూతుమెయిఁ గ్రుచ్చె నాఱమ్ములు, సం క్రీడయ పోలెను ముప్పది | యాడించెను మఱియుఁ దూపు లనిలజు మేనన్. |
201 |
| మ. |
ధను వొం డుగ్రత నెత్తి, యేఁబది శితాస్త్రంబుల్ మరుత్సూనుఁ డా తనిగాత్రంబునఁ గ్రుచ్చినం, గినుకమై ధైర్యంబు శౌర్యంబు నొ ప్ప నతం డుజ్జ్వల భల్లయుగ్మ యుగళ స్ఫారాహతిన్ వాజులం దునిమెం, జూపఱు పిచ్చలింప విలసద్దోర్గర్వ దుర్వారుఁ డై. |
202 |
| వ. | ఇట్లు విరథుండై వృకోదరుండు మెయి వెంచి. | 203 |
| మ. |
గద లీలం గొని తేరు డిగ్గి, మెఱుఁగుల్ గ్రమ్మంగ సారించి యు న్మద యానంబునఁ గిట్టి, ఘోటకములన్ మ్రందించి, బాహా బలం బు దలిర్పన్ భవదీయ సూను నరదంబుం ద్రెళ్ళఁ ద్రోవంగ, బె ట్టిదపుం దోమర మెత్తికొం చతఁడు దాఁటెన్ నేలకున్ గ్రక్కునన్. |
204 |
| వ. | అట్లు దాఁటి, బెట్టువైచిన యత్తోమరంబునం గాఁడ నేసి, యక్కీచకారాతి పదుమూఁడువత్సరంబులు దమపడినపాట్లును బ్రతినచందంబును డెందమున నావహిల్ల, నుద్దండ గదాదండంబున దుశ్శాసను వైవ నతండు తద్గదాఘాతంబున నెత్తురు దొరఁగ ధరణిం బడిన, బెబ్బులి లేడికొదమం బొదువు పోలికం బొదివి మెడ నిక్కం ద్రొక్కి యెక్కుడు మదంబున నక్కుమారునితో ని ట్లనియె. | 205 |
| క. |
‘మును సభఁ బలికినదానం | దని వోవక యిచ్చటికి వెదకి వచ్చితి యే మనియె దనుము; నీ మాటలు | వినుటకు నా కినుక సాల వేడ్కపడియెడున్.’ |
206 |
| వ. | అని, యమ్మహాబలనందనుండు మహోగ్రలోచన ప్రభలు నిగుడ మన బలంబులం జూచిన. | 207 |
| క. |
నిగుడు దవాగ్ని జ్వాలల | వెగడందిన మృగకులంబు విధమున, నతి భీ తి గదిరి నలుగడ విచ్చిన, | జగతీశ్వర! యతఁడు మెఱసెఁ జక్కని బయలన్. |
208 |
| వ. | అప్పుడు నీయందుఁ జేయంగల సైనికులు సూచి, తత్తేజో విశేషంబునం జూడ్కులు మిఱుమిట్లు గొన వెఱచఱచి, యంతంత ఱిచ్చవడియుండ. | 209 |
| శా. |
లీలం గేల నమర్చి, మత్తగజ కేళీ సుందరోల్లాస మా భీలత్వం బలరింపఁ ద్రిప్పుఁ, జదలం బృథ్వీస్థలిన్ వైచు, ముం గాలం ద్రోయు, మొగంబు వ్రేయు, దెస లుగ్రస్ఫూర్తి వీక్షించు, మోఁ కా లూఁదుం బయిఁ, గ్రమ్మఱంగ మెడ చిక్కం ద్రొక్కి నిల్చున్, నగున్. |
210 |
| వ. | ఇవ్విధంబునం ఘోరవిహారంబు సలిపి, భీమవిక్రముం డగు నా భీమసేనుం డయ్యువరాజు నాననం బాలోకించి. | 211 |
| క. |
‘ఏ నురము వ్రచ్చి నెత్తురు | తేనియ యిది ద్రావెదం; | గదిసి ననుఁ గడిమిన్ మానుప దిక్కు గలిగిన | న్రాని మ్మెలుఁగింపు మీ మొనం గలవారిన్.’ |
212 |
| వ. | అని పెలుచం బలికి, కుఠారంబు వెఱికి యతని మొగంబుమీఁద జళిపించి. | 213 |