| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | కర్ణపర్వము - తృతీయాశ్వాసము |
| క. |
‘భువనము లన్నియు నొక్కఁ | గవిసియుఁ గర్ణుఁ బరిమార్పంగా నోపునె? భూ ధవ! భవదీయ క్రోధా | గ్ని విహతుఁడై క్రాఁగెఁ గాక నిక్కం బరయన్.’ |
387 |
| ఆ. |
‘రథిక వర్యుఁడైన రాధేయు పొలిసిన | యపుడ యెల్లఁ బొలిసె నని తలంపు కౌరవుల; కడంగె వైరంబు, నీ కింక | నెదురు లేదు; ప్రీతిఁ బొదలు మధిప!’ |
388 |
| చ. |
అన విని, యమ్మురాంతకున కా నృపుఁ డిట్లను ‘నీవు చక్కఁ జూ చిన సులభంబు శోభనము శ్రీధర! నీదగు కూర్మి కేను భా జన మటె! నాకు దుష్కరమె శత్రుజయంబు? భవత్ప్రసాద జీ వనులము మాకు సంపదలు వచ్చు నవశ్యము నింత నమ్ముదున్.’ |
389 |
| ఆ. |
‘అఖిల రక్షకుండ వగు నీకు భక్తుల | మైన మమ్ముఁ గాచు టరుదె? తలఁప భయము నెవ్వగయును బాసి నా కంటికి | నిదుర వచ్చు నేఁడు నీరజాక్ష!’ |
390 |
| వ. | అనవుడు, నచ్యుతుండు. | 391 |
| చ. |
‘మనమునఁ గూర్తు గాన, తగుమాటల నాకుఁ బ్రియం బొనర్చు టొ ప్పును; విను మీ జయంబునకు భూవర! యేను నిమిత్తమాత్ర; మీ యనుజులు నీమఱందులు మహాద్భుత విక్రమశీలు; రిట్టి ని న్ను నొకఁడు పోర మార్కొనఁగ నూల్కొని రూపఱకుండ నేర్చునే?’ |
392 |
| వ. | అని యిట్లు, మధుర సల్లాప సౌఖ్యంబు నొంది, ధర్మనందనుండు పొలికలను సూచువేడుక దనకుం బుట్టినఁ, గృష్ణునితోడం జెప్పి యతం డనుమతి సేయం, గాలవాలంబులు దంత వర్ణంబులునగు రథ్యంబులఁ దన రథంబునఁ బూన్పించి, యారోహణంబు సేసి, కరదీపికా సహస్రంబులు వెలుంగ, సమస్తబంధు మిత్ర సోదర పరివృతుండై యరుగునప్పుడు, కృష్ణు నాలోకించి. | 393 |
| ఆ. |
‘సకలధరణివలయ సామ్రాజ్యమునకు నేఁ | డేను భర్తనైతి! నెల్ల పెంపు గలిగి నీదుకరుణఁ గడిఁదిమగం డగు | పగతుఁ డశ్రమమునఁ దెగుటఁ జేసి!’ |
394 |
| క. |
అని కీర్తించుచు, నరుఁ గనుఁ | గొని యగ్గించుచు, ముదంబు గూరిన మదితోఁ జని కర్ణునిశిరమును ద | త్తనయుల గాత్రములుఁ జూచె ధరణీనాథా! |
395 |
| వ. | చూచి తన్నప్పుడు గ్రమ్మఱ జన్మించినవానిఁగాఁ దలంచి, యాపదలకుం బాసి సంపదలకు భాజనంబ నైతి నని యూఱడిల్లి, యుల్లాసంబున మరలె; నిట్లు కర్ణసాగరంబు గడవ నీఁది పాండునందనులు పరమానందంబు నొంది రని, సంజయుండు ధృతరాష్ట్రునకుం జెప్పె నని జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె: | 396 |
| చ. |
అనలుఁడు భాస్కరుండును సుధాంశుఁడు నధ్వరసంప్రవర్తకుల్ వినుము! నరేంద్ర! యీ క్రతువు విష్ణుమయం; బిది నిర్వహించి ర ర్జునుఁడును గర్ణుఁడున్ సమరరూపమునం దగ; నీప్రబంధ మిం పొనరఁ బఠించినన్ వినిన నొందు నరుం జిరసౌఖ్యసంపదల్. |
397 |
| వ. | అనుటయు. | 398 |