పురాణేతిహాసములు శ్రీమహాభారతము కర్ణపర్వము - తృతీయాశ్వాసము
ఆశ్వాసాంతము
చ. ప్రకట మహార్థ సౌరభ పరాశర నందన వాక్యమంజరీ
ప్రకర సమర్చితా! పరమపావననామ! జగత్త్రయీ విధా
యక! పరిరక్షక! ప్రతిసమాహృతికారక! చిత్తవృత్తిభా
వక! భవబంధమోచన! దివాకర చంద్రకృశానులోచనా!
399
క. వినత దురిత నిరసన శుభ | జనన కలాకల్య చరణ! సంభావన పా
వన తటినీమాల్య! సమ | స్తనిగమ సంవేద్య! పరమసంయమిహృద్యా!
400
మాలిని కరణఫల పరిత్యాగ వ్రతోదాత్తచేతః
పరిణత సుఖపీఠ భ్రాజమానా! నతాంహో
నిరసన చరణాబ్జోన్నిద్రతా రాజమానా!
నిరవధి పరిణాహా! నిర్భరానంద దేహా!
401
గద్యము ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీ మహాభారతంబున కర్ణపర్వంబునందు సర్వంబును తృతీయాశ్వాసము. 402
శ్రీమదాంధ్రమహాభారతంలో కర్ణపర్వం ఇంతటితో ముగిసింది.
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )