పురాణేతిహాసములు శ్రీమహాభారతము మహాప్రస్థానికపర్వము - ఏకాశ్వాసము
ఆశ్వాసాంతము
శా. పారాశర్య వచఃపయోనిధి సుధాభంగీ! దయాసంగి! దు
ర్వారాశేష విపద్విదారణ విహారా! చిన్మయాకార! వి
స్తారోదార! గుణత్రయస్ఫుటవిశేషా! నిర్గుణాశ్లేష! మా
గౌరీత్వోజ్జ్వల తత్త్వభాస్వర! నిజాకారాత్మకత్రీశ్వరా!
077
క. ప్రణవైకభావ్య! సురర! క్షణ కేళీస్తవ్య! జన్య సకలద్రవ్యా!
గణనాతీతా! పోష్య | ప్రణతవ్రాతా! నిరీహభక్తి ప్రీతా!
078
మాలిని అమృత వికిరణ క్రీడాభిరామా! త్రిధామా!
దమిత సకల దైత్యోద్వాహ! విజ్ఞాన దేహా!
సుమహ దుపనిషత్ప్రస్తుత్యభిశ్రావ్య! సేవ్యా
శమన రమణశీలా! సంభృతానందలీలా!
079
గద్యము ఇది శ్రీమదుభయకవిమిత్త్రకొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బయిన శ్రీ మహాభారతంబునందు మహాప్రస్థానిక పర్వంబు సర్వంబు నేకాశ్వాసము. 080
శ్రీమదాంధ్ర మహాభారతములోని ‘ఏకాశ్వాసమైన మహాప్రస్థానికపర్వం సర్వం ముగిసింది.
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )