| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | మౌసలపర్వము - ఏకాశ్వాసము |
| శా. |
కాలసై ర్వవిహారభంజన! కళాకౌతూహల స్తవ్య! దు శ్శీలాంతఃకరణావిభావ్య! కరుణాశ్రీమందిరాపాంగ! మం త్రాళీవాచ్య! సుధామయాంగ! పవనవ్యాపారరోధక్రియా శాలిస్వాంత సముల్లసద్విహరణా! సంసార నిస్తారణా! |
224 |
| క. |
హృదయకమలమధురూపా! | విదారిత దురంతతాప! వేదస్తోమా స్పద పారాశర్యమన | స్సదనా! దివిజ శుభకృద్వచనపరవదనా! |
225 |
| మాలిని |
అమరగణవిరోధి వ్యాపదాపాది కోపా! శమితవినతచిత్తాసంగిగాఢప్రతాపా! యమనియమ వికాసిధ్యాన గేహప్రదీపా! దమశమకలితానంద ప్రకాశస్వరూపా! |
226 |
| గద్యము | ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్య పుత్త్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతం బయిన శ్రీమహాభారతంబునందు మౌసలపర్వంబు సర్వంబు నేకాశ్వాసము. | 227 |
| శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఏకాశ్వాసమైన మౌసలపర్వం ముగిసింది. | ||