పురాణేతిహాసములు శ్రీమహాభారతము స్వర్గారోహణపర్వము - ఏకాశ్వాసము
శ్రీరస్తు
శ్రీమదాంధ్ర మహాభారతము
స్వర్గారోహణపర్వము - ఏకాశ్వాసము
క. శ్రీవర్ధనాయురభివృ | ద్ధ్యావహచరణ శతపత్ర! యమనియమాది
ప్రావీణ్య పూర్ణ మిత్ర! మ | హా విద్యోన్మేషగాత్ర! హరిహరనాథా!
001
వ. దేవా! జనమేజయుండు వైశంపాయనుతోడ ‘మత్పూర్వపితామహు లగు పాండవులును ధార్తరాష్ట్రులును స్వర్గం బారోహించి యెట్టెట్టి నెలవుల నిలిచి? రెట్లు వర్తించిరి? చెప్పవే!’ తదాకర్ణన కౌతుకంబు మదీయ చిత్తంబున నుత్తరంగం బగుచున్నయది; నీవు సర్వవిదుండ వేను భవదీయ సదయవాక్య సంభావనకు నర్హుండ’ నని ప్రార్థించినం బ్రచుర దివ్యజ్ఞాన మాననీయుండును బరమకృపా విధేయుండును నైన సాత్యవతేయుని సాదర కరుణా విశేషంబున సంపోషితం బయిన బోధంబున సాధుజన స్తవ్యుం డైన యా భవ్యమునివరుం డక్కురు వంశవరున కిట్లనియె నట్లు బంధు దర్శనంబు గోరి పలికిన పాండవాగ్రజు తలంపున కనుకూలుండై యాఖండలుండు. 002
సీ. తగువాని రావించి ‘ధర్మనందనునకుఁ | దమవారిఁ జూడఁ జిత్తమునఁ గోర్కి
దనికినయది; నీ వితని నటఁ గొనిపోయి | యఖిల బంధులఁ జూపు’ మనుడు నతఁడు
గారవం బెసఁగంగ నా రాజసత్తముఁ | దోడ్కొని పోవఁ గుతూహలమునఁ
దోడన నారదాదులు కొంద ఱరిగి ర | ట్లేఁగెడుచోటఁ గట్టెదురఁ దోఁచె
 
తే. నున్నతాసనాసీనుఁ డభ్యుదిత సరసి | జాప్త సంకాశుఁ డమృతాశనాంగనాది
వృతుఁడు వీరలక్ష్మీ విరాజితుఁడు సతత | యుక్త సుఖసాధనుండు దుర్యోధనుండు.
003
వ. ఇ ట్లొప్పియున్న యతనిం గని ధర్మనందనుండు దేవమునివరుల మొగంబు లాలోకించి. 004
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - svargArOhaNa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )