| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము |
| వ. | కతిపయ పరివారంబు పరివేష్టింప రయంబునం జనుదెంచి సముచిత ప్రకారంబున ధర్మనందనుం బేరోలగంబునం గని సంభ్రమాలింగనాసనార్ఘ్య పాద్యంబుల నతనిచేత సంభావితుండయి, దామోదర భీమార్జున నకుల సహదేవుల యభివాదనంబు లాదరించి, పాంచాల విరాట ప్రముఖులగు తగువారల వినయంబుల నభినందించి, యా దొరలతోఁ దత్కాలయోగ్య మితసంభాషణంబులు సేసి, యనంతరంబ వారల కిట్లనియె: | 166 |
| క. |
‘కౌరవ పాండవు లెంతయుఁ | గ్రూరత వాటించి బంధుకోటికి నిఖిలో ర్వీ రమణులకుం జేటుగఁ | బోరికిఁ దెగి; రిట్టి ఘోరపుంబని యగునే? |
167 |
| తే. |
ఇట్టిదానికి నోర్వక యెన్నఁడేనిఁ | గృష్ణుతోడ నేఁ జెప్పితిఁ, గినిసి యిరు దె ఱంగువారికిఁ దగఁ జెప్పి సంగతంబు | సేయు మని యెంత సెప్పినఁ జేయఁడయ్యె. |
168 |
| క. |
పలుకుల పొం దెఱుఁగని వా | రలఁ బూజావాక్యములఁ దిరంబై తనకుం దెలుపం దగదే? యే మని | యలుకమెయిన్ సంధి సెఱిచి హరి యేతెంచెన్? |
169 |
| తే. |
వీరు వారును సంబంధ విషయబంధు | లగుట సరిగాదె హరికిఁ; దా నర్జునునకుఁ బక్షపాతంబు చేయుటఁ బాండవులను | బెట్టుచోటులు గానక పట్టి క్రాలు. |
170 |
| ఉ. |
కావున వీరికిన్ జయము గల్గుట నిశ్చయ; మెల్ల భంగులం జావు నిజంబు వారికి; నసంశయమై యిటులుండ దీని నె ట్లే వినఁ జూడ నేర్తుఁ? దగ నింత ప్రవీణుల నేన చేసితిం జూవె! సుయోధనుం బవనసూనుని నొండొరుఁ జంపఁ జూతునే? |
171 |
| క. |
హరి యెఱుఁగని చక్కటియుం | బురుషార్థము నా కెఱుంగఁ బోలునె? యీ ని ష్ఠురత వినఁ జూడఁ జాలక | సరస్వతీ తీర్థమునకుఁ జనియెడు బుద్ధిన్. |
172 |
| వ. | మీకుం జెప్పిపో వచ్చితిఁ; బోయి వచ్చెద’ నని పలికి బలదేవుండు వాసుదేవ ధర్మపుత్త్రు లొడంబడి యనుపఁ దీర్థయాత్ర వోయెఁ; దదనంతరంబ. | 173 |