| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఉద్యోగపర్వము - చతుర్థాశ్వాసము |
| సీ. |
కృష్ణుని దేవి రుక్మిణి సోదరుఁడు రుక్మి | యను రాజు బలవిక్రమాన్వితుండు శార్ఙ్గగాండీవ విజయములు నాఁగల | దివ్య చాపములఁ దృతీయమైన చాపంబు గలవాఁడు సైన్య సమేతుఁడై | చనుదెంచి ధర్మజుఁ గని తదీయ సత్కారములు గాంచి సముచితాసనమున | నుండి యక్కొలువున నున్న వీరు |
|
| ఆ. |
లెల్ల వినఁ గిరీటి కిట్లను ‘సమరంబు | సేయ వెఱచితేనిఁ జెప్పు; నాకు నెదురు లేరు జగతి నెవ్వరు; నీకుఁ దో | డ్పడి జయింతు నెట్టి పగఱనైన.’ |
174 |
| వ. | అని తన్ను నాక్రమించి తన తోఁబుట్టువు రుక్మిణిం గొనివచ్చిన యా కృష్ణు సన్నిధిని సిగ్గులేక యాడిన మాటలు విని, చిఱునవ్వు నవ్వుచుం గవ్వడి యతని యాననం బాలోకించి. | 175 |
| తే. |
‘చెనసి గంధర్వసేన నిర్జించునపుడు | మత్స్యనాథు గోవర్గంబు మరలఁ దెచ్చు నెడను దప్పె; నీకందువ యెఱుఁగనైతి | నింక నౌఁగాని తోడుగ మ్మెచటి కైన.’ |
176 |
| వ. | అని యతని యుత్తరమునకుఁ దగిన యట్ల పలికి, మఱియును. | 177 |
| క. |
‘ము న్నే నసహాయుఁడనై | చన్న గతిం జనఁగ నైన చందం బయ్యెన్; వెన్నుఁడు తోడుగలఁడు; వెఱ | పెన్నండును వలవ దింక నేమిటికైనన్. |
178 |
| చ. |
వెఱచితి రాఁగదే యనిన వెండికదా పగఁదీర్తు వీవు; నా వెఱపెటులున్న నీ రథిక వీరులు వాపెద; రొల్ల నిన్ను; నీ యుఱుకడ కేఁగి తోడుపడు మొడ్లకు నెవ్వరికేని’ నన్న నే డ్తెఱ నతఁ డేఁగి కౌరవపతిం గని యట్టుల బెట్టుపల్కినన్. |
179 |
| క. |
ఆతఁడివి యేటిమాటలు | నీ తోడగు టొల్లఁ బొ’మ్మనిన రుక్మి వృథా యాతాయాస విషణ్ణుం | డై తన పురమునకు మగుడ నరిగెం బెలుచన్. |
180 |
| తే. |
ఇట్లు బలదేవ రుక్ముల కిద్దఱకును | గయ్యమునకు సన్నాహంబు గలుగదయ్యెఁ గాని తక్కులోకమ్మునఁ గలుగు నృపతి | కోటి యిరువాఁగు నందును గూడె ననికి. |
181 |
| వ. | అట్టియెడ నిశాసమయంబున ధృతరాష్ట్రుండు సంజయు రావించి యిట్లనియె. | 182 |
| క. |
‘బవరము గీడని యెఱుఁగుదు | నవినీతుండైన కొడుకు నదలిచి యుడుపం దివిరియు నోరాడమి దై | వ వశం; బప్పనికి మనకు వగ పింకేలా? |
183 |
| క. |
ఎయ్యది గానున్నది యది | యయ్యెడుఁ; జేయునది గలదె? యవనీశులకుం గయ్యానఁ జచ్చుటయు మే; | లయ్యొప్పుట లెస్సగాక! యది యట్లుండెన్. |
184 |
| వ. | రెండు వీళ్ళును గురుక్షేత్రంబున విడిసిన పిదపం బుట్టిన విశేషంబులు గలవేని నెఱింగింపుము.’ | 185 |