| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - ప్రథమాశ్వాసము |
| క. |
ఓంకార వాచ్యునకు, నన | హంకార నిరూఢ భావనారాధ్యునకున్, హ్రీంకారమయ మనోజ్ఞా | లంకారోల్లాస నిత్యలాలిత్యునకున్. |
32 |
| క. |
త్రిభువన శుక దృఢపంజర | విభవ మహితునకు, సమస్త విష్టప నిర్మో క భుజంగపతి, కఖిల జగ | ద భిన్న రూపునకు, భావనాతీతునకున్. |
33 |
| క. |
శ్రుతి సీమంత మణికి, నా | శ్రిత వాంఛాపూర్తి కరణ చింతామణి, కా నత దురిత తమో ద్యుమణికిఁ | గ్రతుభూషణమణికి, లోకరక్షా మణికిన్. |
34 |
| క. |
పరమశమ నిరత సంయమి | వరమానస కుముదహాస వర్ధన చంచ చ్చరణ నఖ చంద్రికా వి | స్ఫురణా చిత్రప్రకార శోభాఢ్యునకున్. |
35 |
| క. |
హరిహరనాథునకు, మరు | త్సరిదాకల్పిత మనోజ్ఞ చరణ శిరస్సుం దరమూర్తికి, భావనత | త్పర చేతో యుక్త భక్తపరతంత్రునకున్. |
36 |