| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - ద్వితీయాశ్వాసము |
| ఉ. |
బాంధవ శాత్రవాకలిత భావభవా! భవపాశబంధ సం బంధవిరామ రామ! పరిపక్వ వివేక నిరూఢ భక్త హృ ద్గ్రంధి విభేదనా! పరమకారుణికా! పరిమాణదూర! దుః ఖేంధన పావకాయిత సమీక్షణ! నిత్య మహాద్భుత ప్రదా! |
333 |
| క. |
అన్నమయత్వాది విరా | మోన్నత! వాఙ్మనసదూర! యోగిస్మేరా! భిన్నాభిన్నాకార | చ్ఛన్నాత్మీయ ప్రకార! జగదాధారా! |
334 |
| మాలిని |
కమలభవ కిరీటగ్రామ పద్మావలీ సం గమసుభగ పదాబ్జా! గాఢభక్తి ప్రకార ప్రముదిత ముని శశ్వద్భావనా గమ్య! రమ్య! క్రమపరిణతమూర్తీ! శ్రౌతశాఖాగ్రవర్తీ! |
335 |
| గద్య. | ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీమహాభారతంబున విరాటపర్వంబునందుఁ బ్రథమాశ్వాసము. | 336 |