| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - ద్వితీయాశ్వాసము |
| క. |
ఇనుఁడు దనకడకు నేతెం | చిన రాగముఁ బొందు టిది యుచిత మనఁగాఁ గెం పున మెఱసి పశ్చిమాశాం | గన జనసంభావనముల గౌరవ మందెన్. |
318 |
| ఉ. |
చుక్కలు తోడుతోడఁ దలచూపఁదొడంగె, మనోభవుండు వి ల్లెక్కిడి చక్రవాకముల యిక్కలు రోయఁగఁజొచ్చె, నేల కెం పెక్కుచు వచ్చె; దీవియల యేడ్తెఱ సోయగ మందె; సందడుల్ దక్కెఁ బురంబు వీథుల, మదం బొలసెన్ విట చిత్తవృత్తులన్. |
319 |
| వ. | పదంపడి జారచోరజనంబుల మనంబు లలరం జంద్రాస్తమయం బగుటయు. | 320 |
| క. |
పెనుమి ఱ్ఱిది పల్లం బిది | యనకుండఁగ నోలమును బయలు నొక్కటిగాఁ గనువిచ్చుటయును మోడ్చుట | యును సరిగాఁ దమము పర్వె నుర్విం దోడ్తోన్. |
321 |