ఇతిహాసములు భారతము విరాటపర్వము - తృతీయాశ్వాసము
ఆశ్వాసాంతము
చ. పరమ కృపావిధేయ! నిరుపాధిక చిన్మయ కాయ ! గాఢ వి
స్తరనిగమైకవేద్య! గుణతత్త్వ వికార నియత్యభేద్య ! సం
స్మరణ నిరస్త తాప! ఘన సంసృతి సంతమస ప్రదీప! ని
ష్ఠుర భుజసార దానవ నిషూదన! భక్తజన ప్రమోదనా!
363
క. చతురానందమయా | దు | ర్గతిరో గోద్గమ చికిత్సకా! భువన భవ
స్థితి సంహారకరా! నిర్వృతి పణ్యాపణ పదారవిందవికాసా !
364
మాలిని సురపతి ధృతచూడా శోభిరత్నాంశు వీచి
స్ఫురణ సుభగపాదాంభోజ సంచారకేళీ
పరిచయ కలనాలబ్ధవ్యయాతీత సౌఖ్యో
త్తర మునిజన హృన్మా ద్యన్మరాళ ప్రతానా!
365
గద్య. ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీమహాభారతంబున విరాటపర్వంబునందు ద్వితీయాశ్వాసము. 366
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - virATa parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )