| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - చతుర్థాశ్వాసము |
| చ. |
అపరిమిత ప్రకార! వినిరస్త సమస్త వికార! షట్ప్రమా ణపరమదూర! గాఢ భజనక్రమ గత్యనుభావ్య పార! దే వ పితృపథప్రవర్తన వివర్జన నిర్మలచిత్త చోర! శాం తిపరమహాత్మ! సంసరణ తీర! నిరంజన భక్తరంజనా! |
238 |
| క. |
విజ్ఞానానంద రసా | భిజ్ఞ హృదయ కమల హంస! భీమ దురిత మ ర్మజ్ఞ! వివిధాభిధానా! | యజ్ఞాత్మకరూప! నిశ్చ లావ్యయ దీపా! |
239 |
| మాలిని |
త్రిజగదవననిత్యక్రీడనోద్యత్ప్రమోదా! రజనిచర విఘాతారంభ లీలా వినోదా! భజన నిరత సౌఖ్యప్రాప్తి జాగ్రత్ప్రసాదా! నిజతను విభవత్వోన్మీల నాచ్ఛిన్న నాదా! |
240 |
| గద్య. | ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీమహాభారతంబున విరాటపర్వంబునందుఁ దృతీయాశ్వాసము. | 241 |