| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | విరాటపర్వము - పంచమాశ్వాసము |
| మ. |
నవతాదూర! పురాణతానుపగతా! నానాత్వ సంశోభితా! వివిధత్వాపగమోజ్జ్వలా! బహుకళావిర్భావశాలీ! సము ద్భవ రాహిత్య నిరూఢ! సూక్ష్మతర సంభాసా! మహాస్థూల మూ ర్తి విశేషా! నిరుపాధికా! గుణమయా! ధీవర్తకా! నిష్క్రియా! |
275 |
| క. |
అంతఃకరణ చతుష్టయ | శాంతి సముద్యద్వివేక సంపద్వేద్యా! చింతాతంతు త్రుటనా | త్యంత విగదగ్ధైక భజన తత్పర హృద్యా! |
276 |
| మాలిని |
ప్రణమదవన విద్యాప్రౌఢ! సంరూఢ కాంతి ప్రణుత చరణ పద్మా! పద్మజాదిత్య సత్పో షణ చతుర! దయావిస్ఫారితాలోక! లోకా పణ నిపుణ జనాంచద్భక్తి విక్రీతమూర్తీ! |
277 |
| గద్య. | ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీ మహాభారతంబున విరాటపర్వంబునందుఁ జతుర్థాశ్వాసము. | 278 |