| ఇతిహాసములు | మొల్ల రామాయణము | బాల కాండము |
| దశరథుఁడు పుత్రకామేష్టి కావించుట | ||
| సీ. |
సంతాన లబ్ధికై చింతించి చింతించి-శిష్ట వర్తనుఁ డౌ వశిష్ఠుఁ జూచి, తన కోర్కి వినుపింప, విని మునిసింహుండు-పలికె ఋష్యశృంగు నెలమిఁ దేర, ఘనుఁ డాతఁ డొగిఁ బుత్రకామేష్టి యనుపేర-యాగమ్ముఁ గావింప, నందువలన వినుతి కెక్కఁగఁ జాలు తనయులు గలుగుట-సిద్ధమ్ము, నా మాట బుద్ధిలోన |
|
| తే. |
నిలుపు మని చెప్ప, నా రాజు నెమ్మితోడ-నకుటిలాత్మకు నా విభాండకుని తనయు నెలమి రావించి, పుత్త్రకామేష్టి యనెడి-జన్న మొనరించు చున్నట్టి సమయమునను, |
27 |