| కావ్యములు | మను చరిత్రము | అవతారిక |
| పూర్వకవి ప్రస్తుతి | ||
| మ. |
వనజాక్షోపము వామలూరుతనయు\న్, ద్వైపాయను\న్, భట్టబా ణుని, భాసు\న్, భవభూతి, భారవి, సుబంధు\న్, బిల్హణున్, గాళిదా సుని, మాఘు\న్, శివభద్రు, మల్హణకవిం, జోరు\న్, మురారి\న్, మయూ రుని, సౌమిల్లిని, దండిఁ బ్రస్తుతులఁ బేర్కొందు\న్ వచశ్శుద్ధికి\న్. |
7 |
| ఆ. |
వ్యాసరచిత భారతామ్నాయ మాంధ్ర భా షగ నొనర్చి జగతిఁ బొగడు గనిన నన్నపార్యుఁ, దిక్కనను గృతక్రతు, శంభు దాసు నెఱ్ఱసుకవిఁ దలఁతు భక్తి. |
8 |