కావ్యములు మను చరిత్రము అవతారిక
కుకవి నిరాకృతి
మ. భరమై తోఁచు కుటుంబరక్షణకుఁగాఁ బ్రాల్మాలి చింత\న్‌ నిరం
తర తాళీదళ సంపుట ప్రకర కాంతారంబునం దర్థపుం
దెరువాటుల్‌ దెగి కొట్టి, తద్జ్ఞ పరిషద్విజ్ఞాత చౌర్యక్రియా
విరసుండై కొఱఁత\న్‌ బడు\న్‌ గుకవి, పృథ్వీభృత్సమీప క్షితి\న్‌.
9
క. అని ఇష్టదేవతా వం
దన సుకవిస్తుతులుఁ, గుకవితతి నికృతియుఁ జే
సి నవీన కావ్య రచనకు
ననుకూల కథల్‌ దలంచు నా సమయమున\న్‌.
10
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - avatArika ( telugu andhra )