కావ్యములు మను చరిత్రము అవతారిక
షష్ఠ్యంతములు
క. ఏవంవిధ గుణవంతున
కావల్గత్తురగ బహు విధారోహ కళా
రేవంతున కతిశాంతున
కావిష్కృతకీర్తి ధవళితాశాంతునకు\న్‌.
43
క. పుంఖానుపుంఖ సైంధవ
రింఖా సంఘాతజాత రేణూగ్ర తమో
రింఖ ద్రిపునృప దహర
ప్రేంఖ దనుగ్రసన జఠరభృత్యసిఫణికి\న్‌.
44
క. అవిరళ వితరణ విద్యా
నవరాధేయునకు సజ్జన విధేయునకు\న్‌
గవితాస్త్రీలోలునకు\న్‌
ఖవిటంక నటద్యశోఽబ్ధి కల్లోలునకు\న్‌.
45
క. దిగధీశాసహ్య ధగ
ద్ధగితేద్ధ రుచి ప్రతాప తపన స్ఫురణ
స్థగిత ద్యుమణికి నిమిషా
ర్ధ గృహీత కళింగరాజ తనయాగ్రణికి\న్‌.
46
క. కరుణాకర వేంకటవిభు
చరణ స్మరణ ప్రసంగ సంగతమతి కీ
శ్వరనృసింహ మహీభృ
ద్వరనందన కృష్ణరాయ ధరణీపతికి\న్‌.
47
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - avatArika ( telugu andhra )