| కావ్యములు | మను చరిత్రము | ప్రథమాశ్వాసము |
| కథా ప్రారంభము | ||
| వ. |
అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పం బూనిన స్వారోచిష మను సంభవం బను మహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టి దనిన, జైమినిముని స్వాయంభువమను కథాశ్రవణానంతరంబున, మీఁద నెవ్వండు మను వయ్యె నెఱింగింపు మనవుడుఁ, బక్షులు మార్కండేయుండు క్రోష్టికిం జెప్పినప్రకారంబున నిట్లని చెప్పం దొడంగె. |
48 |