కావ్యములు మను చరిత్రము ప్రథమాశ్వాసము
అరుణాస్పదపుర వర్ణనము
మ. వరణాద్వీపవతీ తటాంచలమున\న్‌ వప్రస్థలీ చుంబితాం
బరమై, సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ
హరిణంబై, యరుణాస్పదం బనఁగ నార్యావర్తదేశంబున\న్‌
బుర మొప్ప\న్‌, మహికంఠహార తరళస్ఫూర్తి\న్‌ విడంబింపుచు\న్‌.
49
సీ. అచటి విప్రులు మెచ్చ రఖిలవిద్యాప్రౌఢి, ముది మది దప్పిన మొదటివేల్పు
నచటి రాజులు బంటు నంపి భార్గవు నైన, బింకానఁ బిలిపింతు రంకమునకు
నచటి మేటి కిరాటు లలకాధిపతి నైన, మును సంచిమొద లిచ్చి మనుప దక్షు
లచటి నాలవజాతి హలముఖాత్తవిభూతి, నాదిభిక్షువు భైక్షమైన మాన్చు
 
తే. నచటి వెలయాండ్రు రంభాదులైన నొరయఁ
గాసెకొంగున వారించి కడపఁగలరు
నాట్యరేఖాకళాధురంధరనిరూఢి
నచటఁ బుట్టిన చిగురుఁ గొమ్మైనఁ జేవ.
50
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - prathamAshvAsamu ( telugu andhra )