కావ్యములు మను చరిత్రము ప్రథమాశ్వాసము
పసరు మహిమచేఁ బ్రవరుఁడు హిమాద్రి కేఁగుట
క. ఆ మం దిడి యతఁ డరిగిన
భూమీసురుఁ డరిగెఁ దుహిన భూధర శృంగ
శ్యామల కోమల కానన
హేమాఢ్య దరీ ఝరీ నిరీక్షాపేక్ష\న్‌.
79
వ. అనిన విని యమ్మహీసురవరుఁ డట్లరిగి యెట్లు ప్రవర్తించె, నతని
పుణ్యవర్తన శ్రవణంబు మనంబునకు హర్షోత్కర్షంబు గల్పించెఁ,
దరువాతి వృత్తాంతంబుఁ గృపాయత్త చిత్తంబున నానతీయ వలయు
నని యడుగుటయును.
80
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - prathamAshvAsamu ( telugu andhra )