కావ్యములు మను చరిత్రము తృతీయాశ్వాసము
మన్మథోపాలంభము
వ. అని పలికి యక్కలికి తేనియ లొలుకు పూములుకుల జళుకుఁ
బుట్టించు నించువిలుతు నుద్దేశించి.
45
చ. తొడిఁబడఁ బాఱి పైకుఱికి ధూర్జటి కంటి కడిందిమంటలో
నడపొడ గానరాక తెగటాఱియుఁ గాలినయట్టి మ్రోడు కై
వడి, రతిలోచనాంబువుల వాన నిగిర్చితె పాంథబాధకై?
మడియ కనంగ! యవ్వెలఁది మంగళసూత్రమహత్త్వ మెట్టిదో!
46
శా. సాహంకారత శంకరుం డలిగి నేత్రాగ్నిం బయిం బంపినన్‌
స్వాహాకాముకుఁడౌట ని న్నతఁడు గావం బోలు మోమోడి, సం
దేహంబేని రతీశ! నీవు మగుడన్‌ దేహంబుతో నుండు టె
ట్లాహా! దైవము దోసకారులకె తోడై వచ్చు నెప్పట్టునన్‌.
47
చ. జడ నొక యింత లేని నెఱ చక్కఁదనంబుల నెల్లఁ గూర్పఁగాఁ
బొడ వయినట్టి ధన్యుఁడవు భోగివి పూవిలుకాఁడ విట్టి నీ
వెడపక నిష్ఠురత్వమున కెట్లలవాటుగఁ జేసి తక్కటా!
పడఁతులమీఁద నేయ రతిపయ్యెదకున్‌ నను పైన చేతులన్‌.
48
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - tR^itIyAshvAsamu ( telugu andhra )