కావ్యములు మను చరిత్రము తృతీయాశ్వాసము
వరూధినియందు దౌహృద లక్షణములు దోఁచుట
క. ఈ విధమున నయ్యిరువురు
భావజతంత్రైకపరత బహుకాలము సౌ
ఖ్యావహ లీలల నుండం
గా వేలుపుముద్దరాలు గర్భముఁ దాల్చె\న్‌.
118
క. నడ జడనువడియె, నా రే
ర్పడియె\న్‌, జనుమొనలు నల్లవడియె\న్‌, వడియ\న్‌
బడియెఁ గడు నొడలు, పడఁతికి
బడలికయును నిదుర యరుచి బహుళం బయ్యె\న్‌.
119
మ. పలుచంబాఱుఁటఁ గోమలస్మితరుచుల్‌ పైఁదోఁచె నా గౌరకాం
తుల గండద్వితయంబు పొల్చెఁ, బ్రమదార్ణోరాశి ఖేల న్నవో
త్కలికాభంగ పరంపరోపరి సముద్యత్పాండుడిండీర పం
క్తులు నాఁ జిట్టుము లుల్లసిల్లెఁ దఱుచై తోడ్తోఁ గురంగాక్షికి\న్‌.
120
తే. నాకజలజాక్షి నిఱుపేద నడుము బలిసి
యల్ల నల్లన వళిసీమ నాక్రమించెఁ
బేర్చి దివసక్రమంబున బీద బలిసి
బందికాఁ డైనఁ బొరువులు బ్రదుకు గనునె?
121
క. పాటల సుగంధి పాటలు
నాటలు లే కప్పు డొప్పె నలతఁ బథికో
త్పాటన జయ పరిశాంత
జ్యాటంకృతి చలన మదన చాపముఁ బోలె\న్‌.
122
సీ. మనసు కక్కుఱితి మెల్లన లేచి చేతులఁ, గాంతుని జబ్బుగాఁ గౌఁగిలించు
నలసత మృద్గంధియైన కమ్మని నోర, నధరంబు నెడనెడ నాని కూర్కు
మణితాది పవన ధారణశక్తి చాలమి, నొయ్యన నర్మోక్తి నుబ్బొనర్చుఁ
గాంక్షిత క్రీడ కంగము పంపు సేయమి, నొడుగా నిట్టూర్పు లొలయఁ బొగలు
 
తే. నిచ్చ యెఱిఁగిన రతికేళి మెచ్చి పొగడు
నప్పు డక్కాంత రతి పరిహాసవేళ
జీవితేశు సమేళింపుఁ జేఁత లుడుపుఁ
బ్రార్థనాపూర్వ దీనసంభాషణముల.
123
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - tR^itIyAshvAsamu ( telugu andhra )