కావ్యములు మను చరిత్రము చతుర్థాశ్వాసము
. శ్రీ కృష్ణరాయ! గుణ ర
త్నాకల్ప! కల్పకద్రుమాధిక దాన
శ్రీకుతుకాగత లోకా
లోకాంతర సకల సుకవి లోక స్తుత్యా!
1
వ. అవధరింపుము. జైమిని మునీంద్రునకుఁ బతంగపుంగవంబు లిట్లనియె. 2
వరూధిని పుత్రవతి యగుట
సీ. మున్ను విప్రాకారమునఁ గూడుచో శంకఁ, గనుమూయఁ బనిచె నా ఖచరభర్త
యవ్వరారోహయు నాసక్త గావున, నిచ్చలో నటు సేయ నియ్యకొనియె
నా ప్రతిజ్ఞాపూర్తి యయ్యెఁ దనంత న, వ్వనితకు రతిపారవశ్యపటిమ
నపుడు తత్ప్రవర దేహ సమిద్ధ శిఖ దీప్తి, శాంబరీ మహిమచే సంగ్రహించి
 
తే. నట్టి గంధర్వమూర్తి సౌఖ్యానుభూతిఁ
జలన మేదిన మానసాబ్జమున నిలువ
వెలసెఁ దేజోమయం బైన వృద్ధి నట్టి
మేటిగర్భంబు నెలలు తొమ్మిదియు నిండె.
3
వ. అనంతరంబ యొకానొక పుణ్య దివసంబున. 4
శా. తేజం బబ్జభవాండగేహమునకు\న్‌ దీపాంకురచ్ఛాయయై
రాజిల్ల\న్‌ గ్రహపంచకంబు రవిఁ జేరంబోని లగ్నంబున\న్‌
రాజీవాక్షి కుమారుఁ గాంచె సుమనోరాజన్యమాన్యు\న్‌ జనుల్‌
జేజేవెట్టఁ బ్రసూనవర్ష మమరశ్రేణుల్‌ ప్రవర్షింపఁగ\న్‌.
5
క. స్వరుచిస్ఫురణను శశిభా
స్కర పావక తారకాప్రకాశము లెల్ల\న్‌
విరళములు సేయ నతనికి
స్వరోచి యనునామ మిడి రచటి మును లెల్ల\న్‌.
6
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - chaturthAshvAsamu ( telugu andhra )