| కావ్యములు | మను చరిత్రము | చతుర్థాశ్వాసము |
| మౌనుల యొద్దికలో స్వరోచి పెరుఁగుట | ||
| చ. |
మఱియు నతండు సంయమి సమాజ వినిర్మిత జాతకర్ముఁడై నెఱిఁ బరివర్ధితుండు నుపనీతుఁడునై వివిధాయుధంబుల\న్ గఱకరియై రణస్థలుల గద్దఱియై నిగమార్థవేదియై నెఱతనకాఁడునై మెఱసె నిర్మల కాంతి విలాస రేఖల\న్. |
7 |
| స్రగ్ధర. |
గ్రుద్దు\న్ గోత్రాచలంబుల్ గులగుల లయి పో గోతముల్ గ్రుద్దులీల\న్ ఖద్ది\న్ జెండాడు మ్రాఁకుల్ కవుఁగిటికొలఁదుల్ కత్తి నొక్కొక్క ఘాత\న్ బ్రోద్దామప్రౌఢి వాతాద్భుతగతిఁ బఱచు\న్ భూమి జవ్వాడఁగా ని ట్లద్దేవీ నందనుం డత్యనుపమ బలుఁడై యౌవనారంభవేళ\న్. |
8 |
| క. |
వేదండము తొండము సరి కోదండముఁ దివియు నెడమఁ గుడి నిబిడజ్యా నాదము రోదసి నిండఁగ భేదించు\న్ గండశిలలఁ బృథుబాణముల\న్. |
9 |