కావ్యములు మను చరిత్రము చతుర్థాశ్వాసము
స్వరోచి యాటవికుల కేలిక యగుట
క. అతఁడు మఱి తనకు మంథ
క్షితిభృత్తటి విశ్వకర్మ చేసిన నగరి\న్‌
వితతాటవిక చమూ సే
వితుఁడై సామ్రాజ్య మనుభవింప నొకతఱి\న్‌.
10
క. కరకా చిటపట రవ భీ
కరమై పెళపెళ నినాద ఘనమై ఝంఝా
మరు దుజ్ఘిత బిల మంద్ర
స్వరమై యక్కొండ నొక్క వర్షము గురిసె\న్‌.
11
క. తెలతెల వేగిన నగ్గిరి
జలజలఁ బ్రవహించు సెలల చప్పుళ్ళు శిఖా
వల కుల కల కేకా కల
కలములు గల తలపొలంబుఁ గనుఁగొనువేడ్క\న్‌.
12
ఆ. అన్నగాగ్ర మెక్కి యం దొక్క శశికాంత
వేదిఁ గతిపయాప్త వేష్టితుండుఁ
గుటజ విపిన పవన నట దలకభరుండు
నగుచుఁ బ్రొద్దు జరుపు నవసరమున.
13
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - chaturthAshvAsamu ( telugu andhra )