| కావ్యములు | మను చరిత్రము | చతుర్థాశ్వాసము |
| అపశకునములు - శుభశకునములు | ||
| మత్త కోకిల. |
నిండెఁ గావిరి దిక్తటంబుల నింగిఁ గుండలి చండరు ఙ్మండలిం గనుఁగొంచు మ్రోసెను మాలకాకులమూఁక ల య్యండ నిల్చి యదల్చె నప్డు శివాళి యూళలఁ బద్మగ ర్భాండభాండము ధూళిధూసర మయ్యె నుద్ధతవాత్యలన్. |
61 |
| క. |
ఆ కొఱగాములఁ గనుఁగొని శాకునికుం డొకఁడు లేచి సంభ్రమ మొదవ\న్ జ్యాకలిత శరాసనుఁడై వీఁకను సైనికులఁ దిట్టి విభుతో ననియె\న్. |
62 |
| క. |
తఱచుగ మెకములఁ బొరిగొను మఱపున వచ్చితిమి, దవ్వు మనపొల మిట, కి త్తఱి నగునిమిత్తములు నృప! కొఱగా, విదె మనకుఁ బెద్ద గొడవగు ననిన\న్. |
63 |
| మ. |
అతఁ డాస్ఫాలితసజ్య కార్ముకుఁడు వాహారూఢుఁడుం బార్శ్వసం భృతతూణాహృత చండకాండుఁడు దిశాప్రేంఖత్కటాక్షాంచల ద్యుతిజాలుండును నై పుళిందభట సందోహంబుతోడన్ మహో ద్ధతి నుండన్ జయలాభసూచక నిమిత్తంబుల్ మెయిందోఁచిన\న్. |
64 |