కావ్యములు మను చరిత్రము చతుర్థాశ్వాసము
మనోరమ స్వరోచికి అస్త్రహృదయ విద్య నొసఁగుట
సీ. ఇచ్చెద నీ కస్త్ర హృదయంబు నివ్విద్య, నరనాథ? మున్ను పినాకపాణి
యగు రుద్రుఁ డిచ్చె స్వాయంభువ మనువున, కతఁ డిచ్చె మఱి వసిష్ఠాఖ్యమునికి
నతఁడిచ్చెఁ గరుణఁ జిత్రాయుధుం డను పేరఁ, దనరు మదీయ మాతామహునకు
నతఁ డిచ్చెఁ బెండ్లి యౌనపు డరణంబుగా, మా తండ్రి కతఁ డిచ్చె మమత నాకు
 
తే. సకలరిపునాశకము యశస్కరము నైన
దీని వేవేగ నాచేఁ బ్రతిగ్రహించి
యడఁపుమా దైత్యు వీరు వా రనఁగ వలవ
దనఘ! సద్విద్య యెందున్నఁ గొనఁగవలయు.
93
క. అనుటయు శుచియై నిలిచిన
జననాథునకుం బ్రయోగ సంహారంబుల్‌
వనిత రహస్యంబుగఁ జె
ప్పిన నాతఁడు నెఱిఁగె నంత భీషణభంగిన్‌.
94
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - chaturthAshvAsamu ( telugu andhra )