| కావ్యములు | మను చరిత్రము | పంచమాశ్వాసము |
| ఆయుర్వేద విద్యను బొంది, తన తనయను బెండ్లియాడుమని స్వరోచిని గోరుట | ||
| క. |
ఈ ఉపకారమునకుఁ బ్రతి సేయఁగ శక్యంబె జంభజిన్నిభ! శఫరా త్యాయతలోచన యైన మ దీయాత్మజ నీకు నిత్తు దేవీమణిగ\న్. |
28 |
| క. |
ఆయుర్వేదముఁ గైకొని యీ యింతిం బెండ్లియాడు మెలమి రమా నా రాయణ పరిణయ గేయ వి గాయన గంధర్వ మైన కవ్వపుఁగొండ\న్. |
29 |
| లయగ్రాహి. |
అన్నగముపై జరఠ పన్నగపతిస్ఫట ల న న్నెగసి కోటతుదల న్నెగడుకొమ్మల్ మి న్నగల రాయ రుచిఁ జెన్నగు విమానముల పన్నుగడ పన్నుగఁ బ్రభిన్న గజఘోట చ్ఛన్న గహనాపణముల న్నిగనిగద్యుతి ర వి న్నగుమణి ప్రకర మున్న గరిమం బే రెన్నఁగల యంగడుల వన్నె గని సంపదల మన్నగరి యొప్పు బలభిన్నగరి ఠేవ\న్. |
30 |
| తే. |
అని నిజోదంత మావంత యైన దాఁప కంతయును జెప్ప నద్భుతం బంతరంగ మంతయును నిండ హర్షించె నా స్వరోచి, యంత రవి యేఁగెఁ బశ్చిమాశాంతమునకు. |
31 |