కావ్యములు మను చరిత్రము పంచమాశ్వాసము
ఆశ్వాసాంత పద్య గద్యములు
మ. అతులక్షాంతిగభీర! భీరహితచిత్తాంభోజ! భోజక్షమా
పతివిద్యాపరిపాక! పాకరిపుశుంభద్భోగ! భోగాశిప
త్రితరస్స్ఫూర్త్యనుభావ! భావభరిత శ్రీకాంత! కాంతారపా
తితకాళింగకులేశ! లేశతరవృత్తి క్షీణవైరివ్రజా!
105
క. నాగాంబాసుత! జితకద
నాగత మదనాగ సంగమానూప గృహా
భోగా! భోగ పురందర!
భోగీంద్ర శయాన పురుష పూజా ప్రవణా!
106
మాలిని. సరభస జయసరభస జయధాటీ చండ వేదండకోటీ
కరవమథు హిమానీ కంపితాశా వధూటీ
పరమహిత హసంతీ భావ భాగ్భూరితేజః
పరుష దహనకీలా ప్రస్ఫుర చ్ఛక్రవాళా!
107
గద్యము. ఇది శ్రీమదాంధ్ర కవితా పితామహ సర్వతోముఖాంక, పంకజాక్ష
పాదాంబుజాధీన మానసేందిందిర, నందవరపుర వంశోత్తంస,
శఠకోప తాపస ప్రసాద సమాసాదిత చతుర్విధ కవితామతల్లికాల్లసాని
చొక్కయామాత్య పుత్త్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిషమనుసంభవం బను
మహా ప్రబంధంబునందుఁ బంచమాశ్వాసము
 
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - paMchamAshvAsamu ( telugu andhra )