కావ్యములు మను చరిత్రము షష్ఠాశ్వాసము
చెలికత్తెల దుస్థితికి మనోరమ పరితాపము
ఉ. అక్కట! నా యెడ\న్‌ మిగుల నక్కఱ గల్గి చరించు నెచ్చెలుల్‌
చిక్కి మునీంద్ర శాపహతిఁ జెందిన దుర్దమ రోగబాధలం
బొక్కుచు నున్నవారు వన భూములఁ, దద్దశ మాన్పవేని నా
కెక్కడి సౌఖ్య? మన్నఁ దరళేక్షణఁ జూచి స్వరోచి యిట్లను\న్‌.
10
క. పరితాప మింక నేటికి?
హరిణాక్షి! మదీయ సంచితాయుర్వేద
స్ఫురణమునఁ బరిహరించెద
నరు దనఁగ భవత్సఖీజనామయ భరము\న్‌.
11
క. నా వెనుక రమ్ము, నీ సఖు
లే వనమున నున్నవార? లిపుడ చికిత్సం
గావింతు ననుచు రయమున
నా వనితఁయు దాను నచటి కరిగి యొకయెడ\న్‌.
12
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - shhashhThAshvAsamu ( telugu andhra )