| కావ్యములు | మను చరిత్రము | షష్ఠాశ్వాసము |
| స్వరోచి విభావసీ కళావతుల రాజయక్ష్మను నివారించుట | ||
| ఉ. |
ఆ రజనీశబింబ రుచిరాస్యలఁ గాంచి తదామయవ్యథా భారము మాన్పఁగాఁ దమి నృపాలుఁడు తత్కల ధౌత గోత్రకాం తారపదంబునం దుపచితం బగు మందును దత్క్రియోచితా హారము నెమ్మి నిచ్చుచు ననామయధన్యలఁ జేసి పన్నెగాన్. |
13 |
| శా. |
ఆ దివ్యౌషధరాజిచేఁ దమమహా వ్యాధివ్యథల్ దీఱినన్ మోదంబంది లతాంగు లంబుజకులంబున్ నవ్వుకందోయితో సౌదామి న్యభిరామ దేహరుచితో సంపూర్ణ చంద్రానన శ్రీదర్పోన్నతితోఁ జెలంగి సురనారీసూనుఁ గీర్తించుచున్. |
14 |
| క. |
మా కుపకార మొనర్చితి నీకుం బ్రతిసేయ నెట్లు నేరుతు? మైనన్ లోకోత్తర! మా వలనను జేకొనుకార్యములు గలవు చెప్పెద మెలమిన్. |
15 |