కావ్యములు మను చరిత్రము షష్ఠాశ్వాసము
స్వరోచి కళావతినుండి పద్మినీ విద్యను గొనుట
క. విను మదియుఁ గాక పద్మిని
యనఁ బరఁగిన విద్య నేఁ బ్రియంబున నిత్తు\న్‌
గొను నీవు తత్ప్రసాదం
బున నీకు నభీష్టసౌఖ్యములు సిద్ధించు\న్‌.
57
వ. అని రహస్యంబుగా నవ్విద్య నాకు నుపదేశించి ముక్కంటి
వాల్గంటి మింటిచొప్పునం జనియె. నేనును దద్వచనామృతా
స్వాదనంబ యూఁతగాఁ బ్రాణంబులు వట్టుకొని యున్నదాన. నా
స్వరోచి నీవ కాఁ దలంచెద, వంచనాలాపంబు లుడిగి య
ప్పద్మినీ విద్యారత్నంబుతోఁ గూడ నన్నుం బరిగ్రహింపు మనిన
నంగీకరించి య మ్మహీవిభుండు.
58
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - shhashhThAshvAsamu ( telugu andhra )