| కావ్యములు | మను చరిత్రము | షష్ఠాశ్వాసము |
| విభావసీ కళావతులకుఁ బెండ్లి యగుట | ||
| క. |
ఏకాగ్రత నవ్విద్యలు గైకొని పుణ్యాహపూర్వకంబుగ గుణ ర త్నాకరుఁ డయ్యిద్దఱ న స్తోకోన్నతిఁ బెండ్లియయ్యె సుముహూర్తమున\న్. |
59 |
| ఉ. |
ఆ సమయంబున\న్ మొరసె నభ్రపథంబున దేవదుంధుభుల్ సేసలు చల్లి రచ్చరలు సిద్ధనికాయము చేరి సన్నుతుల్ సేసెఁ బ్రసూనవృష్టి గురిసె\న్ జన రంజన కారి వాసనో ల్లాసములై చెలంగె శుభలక్షణ దక్షిణ గంధవాహముల్. |
60 |
| క. |
ఈ విధమున నుద్వాహం బై వేలుపువెలఁదిపట్టి యంచిత మతి న ప్పూవుంబోఁడులు మూవుర తో వివిధ విహార సంగతులఁ దత్పరుఁడై. |
61 |