కావ్యములు మను చరిత్రము షష్ఠాశ్వాసము
చక్రవాకి విమర్శ విని స్వరోచి సిగ్గుపడుట
చ. పలుకులు వేయు నేమిటికి? భాగ్య సమన్విత నేన మద్విభుం
డిలఁ గలధన్యుఁడంచు నెలుఁగెత్తి వరూధినిపట్టి ముందటం
బలుకు రథాంగమానవతి పల్కు లతం డిల జంతు మండలీ
విలస దశేషభాషలఁ బ్రవీణుఁడు గాన నెఱింగి సిగ్గునన్‌.
75
క. తల వాంచి యుస్సురని మదిఁ
దలపోయుచు మానరాని తమకంబున నా
నెలఁతలతో నూఱేఁడులు
విలసితగతి సౌఖ్య మనుభవించుచు నెలమిన్‌.
76
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - shhashhThAshvAsamu ( telugu andhra )