| కావ్యములు | మను చరిత్రము | షష్ఠాశ్వాసము |
| హరిణము స్వరోచిని గర్హించుట | ||
| శా. |
కాంచె\న్ భూవిభుఁ డొక్కనాఁడు కనకాఖర్వ ప్రభా మంజులా స్యాంచన్మేచకరత్న విభ్రమ సనాథానూన దృగ్రోచుల\న్ మించుం బ్రాయపు లేటిపిండు తనుఁ గూర్మిం జుట్టిరాఁ దద్వనో దంచద్భూమిఁ జరించు నొక్కహరిణోత్తంసంబు నింపారఁగా\న్. |
77 |
| క. |
కని సతులకుఁ జూపెడు తఱి ఘనముగఁ దమచెవుల వాలుఁ గన్నులు సోల\న్ మొనసెలవి యెత్తి ప్రియునా ననమున్ మూర్కొనుచు నఱ్ఱు నాకెడువేళన్. |
78 |
| శా. |
హుంకారం బొనరించి వే తలఁగు డోహో! నేను స్వారోచినే పంకేజాక్షులతోడ నెల్లప్పుడు దర్పస్ఫూర్తిఁ గ్రీడింప? ల జ్జాంకూరం బడఁగించినారు తలపోయన్ నాకు రోఁతయ్యె మీ రింక\న్ బోయి వరింపుఁ డొక్కరుని భోగేచ్ఛన్ నివారించితిన్. |
79 |
| చ. |
బరువన కింతులం దనకుఁ బల్వుర గూర్చుట భోగవాంఛఁగా కరయఁగ నొండు గాదు ధన మన్న ధ్రువంబుగ నంగనాజనో త్కరసముపార్జితం బటులు గావున వీనికి లే దిహంబునుం బరమును నన్ను నట్ల పఱుపం బనిలే దిది చెప్ప నేటికిన్. |
80 |
| క. |
వీని విధంబున వనితా ధీనుఁడ నై పెంపు దక్కి తిరుగుచు నుండం గా నే వెఱ్ఱినె! తమకము మాని చనుం డన్న నవియు మసలక చనియెన్. |
81 |