| కావ్యములు | మను చరిత్రము | షష్ఠాశ్వాసము |
| వనదేవతా సౌందర్యాభివర్ణనము | ||
| సీ. |
వల్లీమతల్లి లావణ్య సర్వస్వంబు, విమలాంగ రేఖ నావిర్భవింప మంజుల మంజరీ మహిత సౌభాగ్యంబు, పరివృత్త కుచవృత్తిఁ బరిణమింపఁ బల్లవచ్ఛద చారు భావానుభావంబు, మృదుహస్తలీల మూర్తీభవింపఁ రమణీయ ముకుళ విభ్రమ భాగధేయంబు, కరరుహ స్ఫూర్తి సాక్షాత్కరింపఁ |
|
| తే. |
జేసి మృగియై వహించు నక్షిద్వయంబు-భాసురంబుగఁ దన యంకపాళిలోన మించుక్రొమ్మించు నుపమించు మెలఁత యగుచు-నిలుచు నవ్వనదేవత నృపతి సూచి. |
96 |