కావ్యములు మను చరిత్రము షష్ఠాశ్వాసము
దేవతల పంపున వనదేవత స్వరోచితోఁ గ్రీడించుట
క. పూనిన విస్మయ రసమున
మానిని! మృగివై చరించి మఱి యంగనవై
కానంబడితివి చిత్రం
బే నెన్నఁడు నెఱుఁగఁ జెప్పవే! తెలియంగ\న్‌.
97
సీ. నావుడు నమరకాంతాతనూభవుఁ జూచి, యివ్వన దేవత నే నరేంద్ర!
సకల భూభువన రక్షాదక్షు మనువర్యు, నీ యందుఁ బడయు నెన్నిక సమస్త
దివిజులు నన్నుఁ బ్రార్థించిన వచ్చితి, ననురాగవతి నైన నను వరించి
పడయుము నాయం దపత్యంబు దీన నీ, కగుఁ బుణ్యలోక సంప్రాప్తి యనిన
 
తే. నట్ల కా కని యయ్యంబుజాయతాక్షి-నేకచిత్తంబుతోడ నంగీకరించె
బాల యిట్లు సుఖాంబుధిఁ దేలుచుండి-యంత గర్భిణియై శుభంబగు దినమున.
98
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - shhashhThAshvAsamu ( telugu andhra )