కావ్యములు మను చరిత్రము షష్ఠాశ్వాసము
స్వారోచిషుని జననము
శా. కాంచెం బుత్త్రు విశాల నేత్రుఁ బృథుపక్షఃపీఠ విభాజితుం
బంచాస్యోద్భట శౌర్యధుర్యు ఘనశుంభద్బాహుఁ దేజోనిధిం
బంచాస్త్రప్రతిమాను మానఘను సామ్రాజ్యైకహేతుప్రభూ
తాంచల్లక్షణలక్షితు\న్‌ సుగుణ రత్నానీక రత్నాకరు\న్‌.
99
క. వేడుక నయ్యవసరమున
నాడిరి సురసతులు కిన్నరాంగనలర్థిం
బాడిరి గంధర్వులు గొని
యాడిరి సురతూర్యనినద మగ్గల మయ్యె\న్‌.
100
తే. అట్లు జనియించి స్వారోచిషాఖ్య నతఁడు
శాంతి దాంతి దయా సత్య శౌచ నిరతుఁ
డై యకామతఁ జిరతపం బాచరించె
నచ్యుతునిఁగూర్చి యంతఁ గృపార్ద్రుఁ డగుచు.
101
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - shhashhThAshvAsamu ( telugu andhra )