కావ్యములు మను చరిత్రము షష్ఠాశ్వాసము
స్వారోచిషుని తపమునకు మెచ్చి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించుట
సీ. నీలమేఘము డాలు డీలుసేయఁగఁ జాలు, మెఱుఁగుఁ జామనచాయ మేనితోడ
నరవిందములకచ్చు లడఁగించు జిగిహెచ్చు, నాయతం బగు కన్నుదోయితోడఁ
బులుఁగురాయని చట్టుపల వన్నె నొరవెట్టు, హొంబట్టు జిలుఁగు గెంటెంబుతోడ
నుదయార్కబింబంబు నొఱపు విడంబంబుఁ, దొరలంగ నాడు కౌస్తుభముతోడ
 
తే. జయజయ ధ్వని మౌళి నంజలులు సేర్చు-శర్వ శతధృతి శతమన్యు శమన శరధి
పాలకైలబిలాదిదేవాళితోడ-నెదుటఁ బ్రత్యక్షమయ్యె లక్ష్మీశ్వరుండు.
102
క. ఈ తెఱఁగునఁ దోఁచిన హరి
కాతఁడు సాష్టాంగ మెఱఁగి యంగము పులకా
న్వీతంబుగ హర్షాశ్రువు
లేతేరఁగఁ జూచి భక్తి నిట్లని పొగడె\న్‌.
103
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - shhashhThAshvAsamu ( telugu andhra )