| కావ్యములు | మను చరిత్రము | షష్ఠాశ్వాసము |
| శ్రీ మహావిష్ణువు స్వారోచిషుని మనువుగ నియమించుట | ||
| క. |
సాలోక్యముఁ దుది నిచ్చెద నేలు మిల ద్వితీయ మనువ వీవై నయ ధ ర్మాలోలబుద్ధిఁ దిరముగ వేలుపులకుఁ దపసులకును విధికిఁ బ్రియముగా\న్. |
119 |
| చ. |
అని మహిమ\న్ మనుత్వమున కాతనిఁ బట్టము గట్టి పద్మలో చనుఁడు విరించి శర్వముఖ సర్వసుపర్వులతో నదృశ్యుఁడై చనియె నిజాలయంబునకు శాస్త్రవినిశ్చయయుక్తి దండపా లనముల నవ్విభుండుఁ బ్రజలం బ్రజల ట్లరసెం గృపామతి\న్. |
120 |