కావ్యములు మను చరిత్రము షష్ఠాశ్వాసము
ఫలశ్రుతి
సీ. వానలు సరవితో వర్షించె, సస్యముల్‌, వేళ్ళఁ గొల్చుగ విఱ్ఱవీఁగి పండె
నారోగ్య పుత్త్ర పౌత్రైశ్వర్యవంతులై, బ్రదికిరి నూఱేండ్లుఁ బంచజనులు
పూవుఁబోఁడులు పతి దేవతలై రగ్ని, భయ తస్కర వ్యాధి భయము లడఁగె
ఫల వయః కుసుమాది బహు పదార్థంబులు, రసగంధ సామగ్రి నెసక మెసఁగె
 
తే. నీత్యుపద్రవ మృత్యు రాహిత్యయుక్తి-ధరఁ బ్రజావృద్ధి తామర తంపరయ్యె
న్యాయపథమున స్వారోచిషాఖ్యమనువు-శ్రీలఁ బెంపొంది పాలించు కాలమునను.
121
క. కోరిక నీ స్వారోచిషు
చారిత్రము వినిన వ్రాయఁ జదివిన ధన ధా
న్యారోగ్యపుత్త్రవంతులు
నై రూఢిగఁ గండ్రు పిదప నమరత్వంబు\న్‌.
122
తే. అని మృకండు తనూభవుఁ డనుఁగు శిష్యుఁ
డైన క్రోష్టికి వినిపించినట్టి యీ క
థా సుధాధార నించిరి దయ దలిర్ప
జైమిని శ్రుతిపుటముల శకునివరులు.
123
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - shhashhThAshvAsamu ( telugu andhra )