కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన అవతారిక
షష్ఠ్యంతములు
క. ఏవంవిధ గుణ ఖనికిని
ద్యోవనితా ప్రార్థ్యమాన ధూర్తారి ధరి
త్రీవర సంగతి సుభగం
భావుక రణ ముదిత కలహ పారణ మునికి\న్‌.
25
క. రాధా తన యాధారిత
గాథాధఃకరణ నిపుణ కర సదయునకు\న్‌
మేధావదసాధారణ
బోధాకర హృదయునకు విబుధ సదయునకు\న్‌.
26
క. నాగాంబికా కుమారున
కాగామి గతాధునిక నృపాలభ్యయశ
శ్శ్రీగుంభ హసిత హిమగు ది
శాగజ తను కటజ నైల్య సంభారునకు\న్‌.
27
క. సామర్ష దళిత పరభట
సామజ హయ కూల ముద్రుజ క్షతజ ధునీ
కాముకితాఖిల జలధికి
నాముష్యాయణ సుధీ గృహాంగణ నిధికి\న్‌.
28
క. కోదండ ద్రోణునకును
వేదార్థ స్థాపన ప్రవీణునకు సమి
న్నేదిష్ఠ విమత తరసా
స్వాదన వశ తుంద పరిమృజ కృపాణునకు\న్‌.
29
క. అసుహృదసుపవన విసర
గ్రసనరస వ్యసన వశ వికసదసి రసనా
ప్రసరణ శయఫణ విలసన
విసృమర మరువకిత సమర వీథీస్థలికి\న్‌.
30
క. వైంధ్య ద్విప గంధ నిబ
ద్ధాంధ్యాళి ప్రతిపదోదితాలయ విభవా
వంధ్య ప్రబంధకృతి సం
బంధ్యనుభావునకు బుధిత మనుభావునకు\న్‌.
31
క. వనితా జనతా స్మరునకు
ఘన తాప నితారకాభిక ద్యుచరగవీ
ఘన తాయన కారక స
త్పనితాత్మ నితాంత దాన పరతంత్రునకు\న్‌.
32
క. పరిపంథి దోర్బల సమి
త్పరివర్ధిష్ణు ప్రతాప దహనారణికి\న్‌
సరసకళాధోరణికి\న్‌
నరసాధిప కృష్ణరాయ నాయకమణికి\న్‌.
33
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )