కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
రుక్మిణితో జూదమాడుచున్న శ్రీకృష్ణుని దర్శనార్థము నారదుఁడు వచ్చుట
ఉ. అంతట నొక్కనాఁడు ధవళాంబుజ నేత్రుఁడు వచ్చి రుక్మిణీ
కాంత గృహంబులోన శశికాంత శిలామయ వేది మీఁద నే
కాంతమునందుఁ గొందఱు మృగాయతనేత్రలు గొల్వ, జూద మ
త్యంత వినోద కేళిమెయి నాడుచు నుండఁగ నద్భుతంబుగన్‌,
43
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )