కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
నారదాగమన వర్ణనము
సీ. స రి గ మ ప ధ ని స సంజ్ఞస్వరంబుల - మహతి నభో వాయు నిహతి మొఱయ,
భాగీరథీ పయః పరిపూర్ణ మణి కమం - డలువు హస్తంబునఁ జెలువు మిగులఁ,
బ్రణవ మంత్రావృత్తి పావన స్ఫటికాక్ష - వలయంబు కర్ణ శష్కులిక వ్రేల,
సమర నృత్యోచిత చమరవాలంబును - గక్షపాలయు భుజాగ్రమున మొఱయ,
 
తే. దేహకాంతు లకాల చంద్రికల నీన,
జడలు మోక్షద్రుపల్లవ శంక సేయ,
గగనమున నుండి వచ్చె నాకస్మికముగ
నారివేరంపుఁ దపసి దైత్యారికడకు.
44
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )