కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
నారదునకు రుక్మిణీ కృష్ణుల యాతిథ్యము
క. వచ్చిన మునిపతి కెదురుగ
వచ్చి, నమస్కృతు లొనర్చి, వనితయుఁ దానుం
బొచ్చెంబులేని భక్తి వి
యచ్చర రిపు భేది సలిపె నాతిథ్యంబున్‌
45
తే. అపుడు రుక్మిణి కనుసన్న నబ్జముఖులు
రత్న సింహాసనంబు నారదున కిడిరి,
హరియు నమ్మౌని యనుమతి నర్హ పీఠ
మున సుఖాసీనుఁడై కరంబులు మొగిడ్చి
46
క. సురసంయమివర! మీరిట
కరుదేరఁగ నిప్పుడేఁ గృతార్థుఁడ నయితిన్‌
నిరతంబు మీరు నాపయిఁ
గరుణ గలిగి యునికి యిది యకారణము సుఁడీ
47
క. నావుడు శౌరికి నిట్లను
నా వేలుపుఁ దపసి "మర్త్యుఁ డాడెడి రీతిన్‌
నీవిట్లు పలుక నుచితమె!
యే విశ్వజనీన చరిత! యెఱుఁగనె నిన్నున్‌!
48
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )