కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
నారదుఁడు శ్రీకృష్ణుని దశావతారముల నుతించుట
సీ. ప్రామినుకుల దొంగఁ బాతాళ కుహరంబుఁ - జొరఁ బాఱి చీఱిన చోఱ వీవ,
తరిగొండ వెన్నుపైఁ దాల్చి వేల్పులఁ గూటి - చవి దేల్చినట్టి కచ్ఛపమ వీవ,
నీటిలో మునిగిన నేలచేడియఁ గొమ్ము - కొన నుబ్బ నెత్తిన ఘోణివీవ,
మునిమాపు బలు గంబమునఁ ముట్టి బంటు న - క్కఱఁ గాచినట్టి సింగంబ వీవ,
 
తే. దితిజు మెట్టిన యా పొట్టి దిట్ట వీవ,
పుడమిఱేఁడుల నడఁచిన ప్రోడ వీవ,
కడలిఁ గోలకుఁ దెచ్చిన గబ్బి వీవ,
యిపుడు ద్వారక వసియించు నీవు నీవ!
49
క. రక్కసిమగువల యీలువు
మొక్కపఱిచె దీవ, పాపముల గమి కాలం
ద్రొక్కెదవు నీవ, యింకిట
నిక్కముగా నిన్నుఁ బొగడ నేర్తునె! కృష్ణా!
50
క. ద్వారక వైకుంఠపురం
బీ రుక్మిణి లక్ష్మి, మీర లిచ్చట నునికిన్‌
సారెకుఁ గొల్వఁగ వత్తును
గోరికతోఁ గంసహర! ముకుంద! మురారీ!"
51
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )